
"సూచనలు ఇస్తున్న మండల విద్యాధికారి గజ్జల కనకరాజు "
(పయనించేసూర్యుడు జనవరి 5 దౌల్తాబాద్ రాజేష్)
ఈ రోజు మండల స్థాయిలో ప్రాథమిక పాఠశాలల ఆంగ్లం మరియు గణితం బోదించే ఉపాధ్యాయులకు దౌల్తాబాద్ బాలుర ఉన్నత పాఠశాలలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు మాట్లాడుతూ ఫిబ్రవరి 26న జరిగే జాతీయస్థాయి 3వ తరగతి విద్యార్థులకు పరీక్షకు సంబంధించి విద్యార్థులను సంసిద్ధం చేయాలని ఆంగ్లము మరియు గణితమునకు సంబంధించిన అంశాలను పూర్తిగా విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు మాదిరి ప్రశ్న పత్రాలను తయారుచేసి పరీక్ష నిర్వహించాలని సూచించారు ఈ జాతీయ స్థాయి సర్వే కోసం ఒక ప్రణాళికతో విద్యార్థులకు నేర్పించాలని సూచించారు ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అనిల్ కుమార్, షేకిల్ పాషా రిసోర్స్ పర్సన్ త్యాగరాజు మహారాజ్ బేగం పాల్గొన్నారు.
