పయనించే సూర్యుడు; మార్చి 04: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి. ఎ.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రాహిల్ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తల సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ రాహిల్ మాట్లాడుతూ వ్యాధి నిరోధక టీకాల ప్రాముఖ్యతకై వివరిస్తూ నిరోధక టీకాల ఆవశ్యకత ప్రాముఖ్యత గురించి వివరించారు. అసంక్రమిత వ్యాధుల బిపి మరియు షుగర్ వ్యాధుల గురించి స్క్రీనింగ్ చేసి వ్యాధులను గుర్తించి చికిత్స నిచ్చి ప్రమాద భరిత పరిస్థితులు కలగకుండా అందరికి తీసుకోవలసిన జాగ్రత్తలు సూచనల గురించి తెలియజేయశారు. ఎండ తీవ్రత పెరుగుతున్న కారణంగా వడదెబ్బ వడగాలుల వలన ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అన్ని జాతీయ కార్యక్రమాల గురించి సమీక్ష చేయడం జరిగినదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రహిల్ గారు హెచ్ ఇ ఓ వేణుగోపాలకృష్ణ, మగ మరియు ఆడ ఆరోగ్య కార్యకర్తలు ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.