▪జిల్లా ఆరోగ్య శాఖ అధికారి డా.. వెంకటరమణ..
పయనించే సూర్యడు //23//హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ //కుమార్ యాదవ్..
చేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలోని పలు విభాగాలను తనిఖీ చేసి సాధారణ ప్రసవాలు జరిగేలా సిబ్బంది కృషి చేయాలని తెలిపారు.సిబ్బంది అందరూ సమయపాలన పాటించాలని, రోగుల సంఖ్య పెంచాలని, అందరికీ నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. బిపి, డయాబెటిస్ వ్యాధులకు సకాలంలో పరీక్షలు చేసి వైద్య చికిత్సలు అందించాలని కోరారు. ఓరల్ క్యాన్సర్స్ గుర్తించి సకాలంలో చికిత్స జరిగేలా చూడాలని చెప్పారు. అన్ని వైద్య ఆరోగ్య కార్యక్రమాలు అన్నిటిని అమలు చేసి జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండేలా చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చందు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్యామ్, డివిజన్ హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్, పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మధు సిబ్బంది పాల్గొన్నారు.