
పయనించే సూర్యుడు గాంధారి, సెప్టెంబర్ 04/09/26 గాంధారి మండల కేంద్రంలోని MPPS sc వాడ గాంధారి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ కవి, రచయిత మోతీలాల్ ఆరె కటిక విచ్చేశారు. వారు తమ స్వంత ఖర్చులతో పాఠశాలలోని విద్యార్థులందరికీ అవసరమైన నోట్ బుక్స్‌ను పెన్నులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కవి, రచయిత మోతీలాల్ ఆరె కటిక మాట్లాడుతూ, విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే చదువుపై శ్రద్ధ వహించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు తమ వంతు సహాయం అందించడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని, విద్యార్థులు బాగా చదువుకోవాలని,ఉన్నత స్థాయి కి ఎదగాలని ఆకాంక్షించారు.ప్రతి ఒక్కరూ జన్మనిచ్చిన తల్లిదండ్రులను, విద్య నేర్పిన గురువులను గౌరవించాలని అన్నారు .నోట్ బుక్స్, పెన్నులుఅందించిన మోతీలాల్ ఆరె కటిక పాఠశాల ఉపాధ్యాయురాలు స్వప్న ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,పెద్దబూరి రాములు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.