
పరిశీలిస్తున్న షాద్ నగర్ తాలూకా జేఏసీ నాయకులు
( పయనించే సూర్యుడు జూన్ 19 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్) తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి తొలి దశ మలిదశ ఉద్యమంలో ఎంతోమంది అమరులైన సందర్భంగా,వారి స్మారకార్థం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండల పరిషత్ ఆవరణలో షాద్ నగర్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన అమరవీరుల స్తూపం చివరి దశలో ఉన్నందున, ఆ యొక్క నిర్మాణ పనులను జేఏసీ నేతలు పరిశీలించడం జరిగింది.అతి త్వరలోనే అమరవీరుల స్తూపం ఆవిష్కరిస్తామని, ఉద్యమకారులు మరియు అమరవీరుల కుటుంబాల సమక్షంలో ఆ తేదీని వెల్లడిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ మూలే జనార్ధన్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ త్రిప్పిశెట్టి కరుణాకర్, జేఏసీ కన్వీనర్ నక్క బాల్ రాజ్ యాదవ్,రాష్ట్ర పంచాయతీరాజ్ జనరల్ సెక్రెటరీ బాదేపల్లి సిద్ధార్థ, టీఎన్జీవో అధ్యక్షుడు జక్కుల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు