
స్వచ్ఛ భారత్ మనందరి లక్ష్యం: నాగిరెడ్డి సతీష్ రావు
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 19 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ( డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామలో “స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ భారత్” కార్యక్రమాన్ని పంచాయతీ కార్యదర్శి పెట్టా సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు.స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ భారత్,ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించి పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు.ప్లాస్టిక్‌ను నివారిద్దాం–పర్యావరణాన్ని కాపాడుదాం, “స్వచ్ఛ భారత్ మన లక్ష్యం” అంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ప్లాస్టిక్ నివారణపై బీజేపీ నాయకులు కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి, సేవా సంకల్ప్ అభియాన్ జిల్లా కన్వీనర్ నాగిరెడ్డి సతీష్ రావు,మండల బీజేపీ అధ్యక్షుడు ఆకేటి శ్రీకృష్ణ, ప్రధాన కార్యదర్శి పుల్లెల రామమూర్తి గ్రామస్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా నాగిరెడ్డి సతీష్ రావు మాట్లాడుతూ.. ప్లాస్టిక్ మన దైనందిన జీవన విధానంలో నిత్యావసర వస్తువుగా మారిపోయిందని, అయితే ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోందన్నారు. భవిష్యత్ తరాల ఆరోగ్యం,పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, వీలైనంత వరకు పూర్తిగా నివారించాలని కోరారు. పరిశుభ్రమైన గ్రామాలు, ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రజలందరూ స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పంచాయతీ కార్యదర్శి పెట్టా సత్యనారాయణ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పంచాయతీ సిబ్బంది,సచివాలయ సిబ్బంది,ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది,రెవెన్యూ సిబ్బంది,స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.