
పయనించే సూర్యుడు గాంధారి 26/11/25మండల కేంద్రంలోని
భవిత ప్రత్యేక పాఠశాలలో జరిగే ఫిజియోథెరపీ క్యాంపును మండల విద్యాశాఖ అధికారి శ్రీహరి మరియు పిల్లల అభివృద్ధి అధికారి స్వరూప పరిశీలించారు. ఇలాంటి వ్యాయామ పరీక్ష కేంద్రాల ద్వారా దివ్యాంగులైన విద్యార్థిని విద్యార్థులకు చాలా మేలు జరుగుతుందని వారు తెలిపారు. ఇలాంటి క్యాంపులను మండలంలోని పరిసర గ్రామ దివ్యాంగులు వినియోగించుకొని శారీరకంగా మానసికంగా ఎదగాలని తెలిపారు. ఈ వ్యాయామ పరీక్షలను డాక్టర్ స్వాతి నిర్వహించారు. దివ్యాంగులైన తల్లిదండ్రులకు పర్యవేక్షకురాలు భారతి తగు సూచనలు చేయడం జరిగింది. ఈ భవిత కేంద్రంలో వ్యాయామ పరీక్షలతో పాటు ప్రత్యేక విద్యను అందించడం జరుగుతుందని ప్రత్యేక ఉపాధ్యాయుడు పెంటయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో సి ఆర్ పి షాయద్ మరియు దివ్యాంగుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.