

ఎమ్మెల్సీ నాగరికుంట నవీన్ కుమార్ రెడ్డి
శ్రీ లక్ష్మీనరసింహ ఫిజియోథెరపీ క్లినిక్ ప్రారంభించిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి
హాజరైన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కడెం పల్లి శ్రీనివాస్ గౌడ్
(పయనించే సూర్యుడు జులై 09 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )మానవ శరీరంలో నరాల పట్టుత్వం,కదలికలు తగ్గిపోయిన, కండరాల శక్తి,కీళ్ల విభాగాల నొప్పులు, సొంతంగా శారీరిక పనులు చేసుకోలేని వారికి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఎంతో అవసరం ఉంటుందని ఎమ్మెల్సీ నాగరికుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని (బైపాస్) పెంజర్ల రోడ్ లో ఫిజియోథెరపిస్ట్ (బిపిటి) డాక్టర్ మాదారం మాధురి గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీ లక్ష్మీనరసింహ ఫిజియోథెరపీ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ నాగరికుంట నవీన్ కుమార్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కడెం పల్లి శ్రీనివాస్ గౌడ్ హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫిజియోథెరపీ ద్వారా వైద్యం అందిస్తే వారికి శారీరిక సంవృది, శక్తి పొంది వారి జీవనశైలి సజావుగా సాగేందుకు ఉపయోగపడుతుందని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ డోలి రవీందర్, తాజామాజీ కౌన్సిలర్స్ మాదారం నరసింహ గౌడ్,అనిత శ్రీనివాస్ గౌడ్,మాధవి గోపాల్ గౌడ్,మాజీ ఎంపీటీసీలు మాదారం అనురాధ కృష్ణ గౌడ్,జంగ గళ్ళ కృష్ణయ్య, నాయకులు జనార్దన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి,ఎరుకలి విష్ణుమూర్తి,కిషన్ నాయక్,పరంధాములు గౌడ్,సాగర్,నాట్కో విష్ణు,అనిల్, తదితరులు పాల్గొన్నారు.