టీ పీ జీ పీ డ బ్ల్యూ యూ జిల్లా కార్యదర్శి ఎదులా పురం.గోపాలరావు
పయనించే సూర్యుడు జనవరి 31
పాల్వంచ టౌన్ ప్రతినిధి గడ్డం నరహరి పాల్వంచ టౌన్:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ లో ఫిబ్రవరి 2 న జరుగుతున్న తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయితీ వర్కర్స్ యూనియన్ (టీ పీ జీ పీ డబ్ల్యూ యు) జిల్లా 2 వ మహాసభలను జయప్రదం చెయ్యాలని టి యు సి ఐ అనుబంధ టి పి జి పి డబ్ల్యూ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎదుల పురం గోపాలరావు,, టి యు సి ఐ జిల్లా ఉపాధ్యక్షులు గోనెల రమేష్ లు పిలుపునిచ్చారు. శుక్రవారం పాల్వంచ కేంద్రంలోని టి యు సి ఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రం లో 12.769 గ్రామ పంచాయతీల్లో 60 వేలమంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. 2021 సంవత్సరం పి ఆర్సీ నివేదిక
ప్రకారం అన్నిరంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ముప్పై శాతం ఫిట్మెంట్ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 60 ను విడుదల చేసిందని వారు తెలిపారు.
రాష్ట్రంలో మున్సిపాలిటీలలో విధులు నిర్వహిస్తున్న నైపుణ్యం కలిగిన వారికి 24,500, సెమి స్కిల్డ్, ఆన్ స్కిల్డ్ పారిశుధ్య కార్మికులకు 22,100, 18,000 వేతనాలను అమలు చేసారని వెల్ల డిం చారు. గ్రామ పంచాయితీల్లో జీవో 60 అమలు చేయం పోవడంతో నెలకు 9,500 రూపాయల తక్కువ వేతనం ఇస్తున్నారని ఆవేదన
వ్యక్తం చేశారు. గతంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులను విస్మ రించడంతో తగిన బుద్ధి చెప్పారని, నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు పని భద్రత కల్పించాలని న్యాయమైన వేతనాలను అందించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికు లందరినీ ఆన్లైన్లో నమోదు చేసి వేతనాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.గ్రామ పంచాయతీ వర్కర్స్ సమస్యల సాధన కోసం ఫిబ్రవరి 2 న పాల్వంచ కేంద్రంలో జిల్లా మహా సభలను జరుపుతున్నామని వారు తెలిపారు.
ఈ మహాసభలకు గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కొత్తపల్లి రవి, సి పి ఐ (ఎం ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి ముద్దా బిక్షం, టి యు సి ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మధుసూదన్ రెడ్డి, యాకుబ్ షావలి,హాజరౌతారన్నారు. తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచా యతీ వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభల లో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పారిశుధ్య కార్మికులను కోరారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు వేల్పుల రమేష్, రాయల సిద్దు, నీలం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.