
బీజేవైఎం షాద్నగర్ ఇంచార్జ్ పుట్నాల సాయికుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న ర్యాలీ
( పయనించే సూర్యుడు ఆగస్టు 20 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నేడు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో భాగంగా బుధవారం షాద్ నగర్ బీజేవైఎం అసెంబ్లీ ఇంచార్జీ పుట్నాల సాయి కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేవైఎం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అభినవ్ గౌడ్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొనడం జరిగింది.వారు మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సంవత్సరాలు గడిచినా విద్యార్థుల పరిస్థితుల్లో మాత్రం ఆశించిన మార్పు కనిపించడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి… పాలకులు మారుతున్నారు… కానీ విద్యార్థుల బతుకులు మాత్రం మారడం లేదు.విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడటం మానుకోవాలి. ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థుల పట్ల తన బాధ్యతను గుర్తించి, బకాయి ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలి.రేవంత్ రెడ్డి గారు చెప్పుకునే “నల్లమల పులి” మాటలు ప్రజలను ఆకట్టుకోవడానికి మాత్రమే కాకుండా, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలోనూ చూపించాలి అని వారు డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు వంశీ కృష్ణ , లక్ష్మీ కాంత్ రెడ్డి,చెట్ల వెంకటేష్,శ్రీనివాస్ చారి,ఉదయ్ గౌడ్,అల్లం అనిల్,ప్రశాంత్ గౌడ్,సూర్య గౌడ్,సుధాకర్ అప్ప,శివాజీ, వివేక్,శివ,శ్రీశైలం, యాదయ్య,అభిలాష్,శ్రీధర్,విజయ్, రామక్రిష్ణ, రావుల రాకేష్,చందు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు