
పయనించే సూర్యుడు డిసెంబర్ 31,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
నంద్యాల జిల్లా, ఏషియన్ గేమ్స్ ఫెన్సింగ్ లో సత్తా చాటి రాయలసీమలోనే మొట్ట మొదటిసారిగా భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించి నంద్యాల పేరును దశ దిశల వ్యాప్తి చేసిన ఫెన్సింగ్ క్రీడాకారిని నంద్యాల ముద్దుబిడ్డ పబ్బతి చిన్మయి శ్రేయ 69వ జాతీయ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఫెన్సింగ్ అండర్ 17 బాలికల విభాగంలో మంగళవారం మూడవ స్థానంలో నిలిచి ఫెన్సింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ తరపున మొట్టమొదటి పతకం సాధించి సంచలనం సృష్టించింది.మహారాష్ట్రలో గత 5 రోజులుగా జరుగుతున్న ఈ పోటీలలో ఉమ్మడి కర్నూలు జిల్లా క్రీడా విభాగం తరఫున పాల్గొని పశ్చిమబెంగాల్ క్రీడాకారిణి లపై విజయం సాధించింది.అనంతరం గోవా, ఐ బి ఎస్ ఎస్ ఓ, తెలంగాణ రాష్ట్రాల పై ఫెన్సింగ్ క్రీడలో విజయం సాధించింది.ఆంధ్ర ప్రదేశ్ కు మొట్ట మొదటిసారి గా ఫెన్సింగ్ క్రీడలో పతకం సాధించడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఫెన్సింగ్ క్రీడలో తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యింది.ఈ సందర్భంగా పట్టణంలో పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు, క్రీడాకారులు, చిన్మయి శ్రేయ కు అభినందనలు తెలిపారు.