పయనించే సూర్యడు // మార్చ్ //5 // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ // కుమార్ యాదవ్.. వీణవంక మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియన్ ఆధ్వర్యంలో తోటి ఫోటోగ్రాఫర్ సభ్యుడు చల్లూరు గ్రామానికి చెందిన వేల్పుల రాజు ఇటీవలే అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఫోటోగ్రఫీ కుటుంబ భరోసా 119 సహాయం కింద ఒక లక్ష అరవై వేల(1,60,000) రూపాయలను చెక్కును అతని భార్యకు అందించడం జరిగింది. వీణవంక మండల ఫోటోగ్రఫీ అధ్యక్షులు సంగే మోహన్, ప్రధాన కార్యదర్శి కళ్యాణం రాజు, కుటుంబ భరోసా ఇన్చార్జి కర్రె నాని యాదవ్,తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం సలహాదారు మహిమల కేదార్ రెడ్డి, తెలంగాణ ఫోటో వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి లాడే రవి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లా కుటుంబ భరోసాఇన్చార్జి భూపతి సూరిబాబు శ్రీనివాస్,రమేష్,భాస్కర్,సంతోష్, రమేష్, దయ, శ్రీనివాస్,రాజేష్, సుమన్,దిలీప్ మరియు ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ లు పాల్గొన్నారు