
పయనించే సూర్యుడు జనవరి 6 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు)
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో ఈనెల 10 11 వ తేదీల్లో నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణ పూర్తిగా ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో జరగాలి కానీ ఫ్లెమింగో ఫెస్టివల్ ఒక రాజకీయపార్టీకి సంబంధించిన పండుగ లాగా ప్రభుత్వ అధికారులు నిర్వహిస్తున్నారు ఇది అందరి పండుగ ఈరోజు ప్రమింగో ఫెస్టివల్ నిర్వహణ ర్యాలీ లో భాగంగా ర్యాలీ నిర్వహించారు కానీ ఎక్కడ కానీ తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దెల గురుమూర్తి ఫోటో లేదు అధికారులు ఎవరు కూడా ప్రోటోకాల్ పాటించలేదు. స్థానిక శాసనసభ్యులు ( ఎమ్మెల్యే) ఎంత ముఖ్యమో తిరుపతి పార్లమెంటు సభ్యులు ( ఎంపీ)కూడా అంతే ముఖ్యం ఈ ఎంపీ వైసీపీ పార్టీకి మాత్రమే చెందిన వాడు కాదు తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల ప్రజలందరికీ, అధికారులు అందరికీ పార్లమెంట్ సభ్యుడు ( ఎంపీ ) ……. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అధికారులు నా బ్రాండ్ అంబాసిడర్ అని చెప్తుంటే ఇక్కడ అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు .డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ' ఐటి మినిస్టర్ నారా లోకేష్ ' పార్టీలకు అతీతంగా అందర్నీ కలుపుకొని ప్రభుత్వ ప్రోగ్రాములు చేయాలని కోరుకుంటుంటే ప్రభుత్వ పండగని పార్టీ పండుగ లాగా చేయడం ఎంతవరకు న్యాయం ఆలోచించండి ప్రభుత్వ పండుగని పార్టీల పండగ కాకుండా ప్రభుత్వ పండగలగా ప్రజలందరి పండుగలా జరపాలని ప్రజలు కోరుకుంటున్నారు
