
పయనించే సూర్యుడు న్యూస్ :మారుతున్న అంతర్జాతీయ పరిణామాలు నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,21,900 పలుకుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,850 పలుకుతోంది. ఒక కేజీ వెండి ధర రూ. 1,53,000 పలుకుతోంది. నిజానికి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించిన నేపథ్యంలో బంగారం ధరలు పెరిగాయి.
బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ముఖ్యంగా మారుతున్న అంతర్జాతీయ పరిణామాలు నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,21,900 పలుకుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,850 పలుకుతోంది. ఒక కేజీ వెండి ధర రూ. 1,53,000 పలుకుతోంది. నిజానికి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించిన నేపథ్యంలో బంగారం ధరలు పెరిగాయి. కానీ భవిష్యత్తులో అంటే డిసెంబర్ నెలలో మరోసారి వడ్డీ రేట్లు తగ్గిస్తుందా లేదా అని అనిశ్చితి నెలకొని ఉండి దీంతో బంగారం ధరలు ఒకసారిగా తగ్గడం ప్రారంభించాయి. మరోవైపు డాలర్ విలువ పెరగడం కూడా బంగారం విలువను తగ్గించింది. ప్రస్తుతం US గోల్డ్. ఫ్యూచర్స్ (డిసెంబర్ డెలివరీ) ఒక ఔన్స్ కు 3,996.5 డాలర్ల చొప్పున ట్రేడ్ అవుతున్నాయి. ఈ రోజు 0.5% తగ్గింది. మరోవైపు డాలర్ ఇండెక్స్ మూడు నెలల గరిష్ఠానికి సమీపంలో ఉంది. దీంతో పసిడి ధరలు తగ్గుతున్నాయి. ఇక అంతర్జాతీయ పరిణామాల విషయానికి వస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై సుంకాలు 57% నుండి 47%కు తగ్గిస్తానని చెప్పారు. అందుకు చైనాకు అమెరికాకు రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతులు కొనసాగించడానికి అంగీకరించింది. అలాగే అమెరికా నుంచి సోయా బీన్స్ కొనుగోలు కొనసాగిస్తామని తెలిపింది. మరోవైపు బంగారం ధరలు భవిష్యత్తులో పెరుగుతాయా లేక తగ్గుతాయా అనే సందేహం చాలా మందిలో కలుగుతోంది. ముఖ్యంగా Morgan Stanley ప్రకారం, బంగారం ధర ఇంకా ఎగబాకే అవకాశముందని రిపోర్ట్ చేసింది. ముఖ్యంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత, గోల్డ్ ఈటీఎఫ్ ఇన్ ఫ్లో పెరగడం, సెంట్రల్ రిజర్వ్ బ్యాంకులు బంగారం నిల్వలు పెంచుకోవడం వంటివి చోటుచేసుకుంటే బంగారం ధరల పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు దేశీయ మార్కెట్లలో కూడా బంగారం డిమాండ్ భారీగా తగ్గిన నేపథ్యంలో బంగారం ఆభరణాల ధరలు తగ్గి వస్తున్నాయి. ప్రస్తుతం పెళ్లిల సీజన్ కావడంతో ధరలు తగ్గడంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు పసిడి ప్రియులు ఆసక్తి చూపిస్తున్నారు.