డిసిసి అధ్యక్షునికి ధన్యవాదాలు తెలిపిన ఎల్లయ్య
పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 12,బచ్చన్నపేట మండల ప్రతినిధి నీల పవన్. బచ్చన్నపేట మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బచ్చన్నపేటకు చెందిన అల్వాల ఎల్లయ్యను నియమించారు. మంగళవారం జరిగిన మండల నూతన కమిటీ లో అల్వాల ఎల్లయ్యకి మండల ప్రధాన కార్యదర్శిగా రెండోసారి బాధ్యతలను అప్పగించారు. తనపై నమ్మకంతో తనను ప్రధాన కార్యదర్శిగా ఎన్నికచేసిన జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరియు జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాపరెడ్డికి అల్వాల ఎల్లయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు, పార్టీ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని తనకు ఈ బాధ్యతలను అప్పగించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు అని అల్వాల ఎల్లయ్య అన్నారు.