
పయనించే సూర్యుడు జనవరి 2 రాజేష్ దౌల్తాబాద్)
ఈ రోజు మండల పరిధిలోని ముత్యంపేటలో బడి బయట పిల్లల సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వే జనవరి 7వ తేదీ వరకు చేయడం జరుగుతుంది. విద్యాహక్కు చట్టం ప్రకారం బడి ఈడు వయస్సు కలిగిన పిల్లలు అందరూ బడిలోనే విద్యను అభ్యసించాలి కాబట్టి ఎటువంటి కార్మిక పనుల్లో వారిని చేర్చుకోకూడదు అని సి. ఆర్. పి రాజు అన్నారు. అదేవిధంగా 15 సంవత్సరాల వయసు పైబడిన విద్యార్థులకు సంవత్సరాల వయసు పైబడిన విద్యార్థులకు ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా వారికి పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలురాసేందుకు అవకాశం ఉందని ఇట్టి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు శివకుమార్ పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.