పయనించే సూర్యుడుఆగష్టు 19 పొనకంటి ఉపేందర్ రావు
జిల్లా కలెక్టర్, అధికారుల ఆదేశముల మేరకు మంగళవారం టేకులపల్లి మండలం బర్లగూడెం గ్రామపంచాయతీ జంగాలపల్లి, గ్రామం నందు అటవీశాఖ మరియు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కలిసి కన్వర్జెన్సీ గ్రామసభ ను మండల పరిషత్ అభివృద్ధి అధికారి కుమారి బైరు మల్లేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలను ఉద్దేశించి ఎంపీడీవో మాట్లాడుతూ. హరితవనాలు ఏర్పాటు చేయడంలో భాగంగా వన సంరక్షణ సమితి సంఘాలను ఏర్పాటు చేయడం 20 ప్లాంటేషన్ లలో వెదురు టేకు మొక్కలతో కలిపి మొత్తం 44 000 మొక్కలను నాటించి వి ఎస్ ఎస్ సంఘాలను ఆర్థికంగా బలో పేతం చేయాడం లక్ష్యమని గ్రామస్తులకు వివరించడం జరిగింది. అటవీ భూములలో ఉపాధి హామీ పథకం పనులు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించడం జరిగింది.
అనంతరం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎండి ముక్తార్ హుస్సేన్ మాట్లాడుతూ. ఉపాధి హామీ పథకం ద్వారా మొక్కలు నాటి వాటిని సంరక్షణ చేయాలని ఐదు సంవత్సరాల తర్వాత వచ్చిన ఆదాయం వి ఎస్ ఎస్ సంఘనికి ప్రతిఫలాలు అందుతాయని తెలియజేశారు. గ్రామస్తులు ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్, ఈ కెవైసి చేయించుకోవాలి అని తెలియజేయడం జరిగింది. అనంతరం ఎంపీడీఓ గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బోడ్ పంచాయతీ నందు ఉపాధి హామీ పథకం లో రైతు గుజ్జుల అనంతలక్ష్మి,పెంచుతున్న నిమ్మ తోట ను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎండి ముక్తార్ హుస్సేన్,అదనపు కార్యక్రమా అధికారి కాలంగి శ్రీనివాస్, ఈసీ తిరుపతయ్య, పంచాయతీ కార్యదర్శు లు రమాదేవి, సన్యాసి, సతీష్, లు అటవిశాఖ సిబ్బంది హతిరం, రామ్మూర్తి, గాంధీ, గౌరీ, ప్రశాంత్ ఉపాధి హామీ సిబ్బంది భీముడు, ఈశ్వరి, సత్యనారాయణ, నరేష్ లు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.