
పాయనించే సూర్యుడు సెప్టెంబర్ 19 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండలం బలరాంపురంలో జరిగిన ఉచిత వైద్య శిబిర కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబుతో కలిసి డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం ఏఎంసీ చైర్మన్ ఓగురి భాగ్యశ్రీ, ఐ.పోలవరం మండల పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబు రాజు, జిల్లా టీడీపీ సెక్రెటరీ సాకా సీతాదేవి, ముమ్మిడివరం రూరల్ మండల పార్టీ అధ్యక్షులు అర్ధాని శ్రీనివాసరావు తదితరులు మరియు ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.