పయనించే సూర్యుడు న్యూస్ మే 17 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా ఆర్టీసీ బస్టాండ్లు, బస్ డిపోల్లో శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ తెలిపారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా సహేలీ స్వచ్ఛంద సంస్థ సహకారంతో తొలుత ములుగు, హనుమకొండ బస్టాండ్లో ఈ మిషన్లను ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు.ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలకు విస్తరిస్తామ ని తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ను శుక్రవారం ఆవిష్కరించి మాట్లాడారు. దేశంలోనే ఆర్టీసీ బస్టాండ్లో తొలి సారిగా శానిటరీ నాపిన్ వెండింగ్ మిషన్లను అందుబాటులోకి తెస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలువబోతున్నదని చెప్పారు. సహేలీ సంస్థ వ్యవస్థాపకు రాలు కొమ్ము అనుపమకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.