
(పయనించే సూర్యుడు డిసెంబర్ 30 రాజేష్)
ఈరోజు దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామంలో మార్కెట్ వైస్ చైర్మన్ మద్దెల స్వామి ఆధ్వర్యంలో ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో బస్సు రావడానికి ఇబ్బందిగా ఉందని వారు రోడ్డు పక్కన ఉన్న పొదలను తొలగించడం జరిగింది. మరియు బస్సులకు ఇబ్బందిగా ఉందని వారు జెసిబి పెట్టి ముళ్ళ పొదలను తొలగించడం జరిగింది . ముళ్ల పొదలు రోడ్డు వైపు పొడుసుకు రావడం వల్ల వాహనదారులకు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందా అని మలుపుల వద్ద పొదలు అడ్డంగా ఉండడంవల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కల్పించకపోవడంతో ప్రమాదాలు జరుగుతుంటాయని వారు పొదలు తొలగించడం జరిగింది. రోడ్డు పక్కన ముళ్ల పొదలను తొలగించడం అనేది ప్రజల ప్రాణాలను రక్షించడానికి వారు ఈ రోజు ముందుకు వచ్చి పొదలను తొలగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దుర్గని మధుసూదన్ మద్దెల మల్లేష్ నల్లని నరేష్ వార్డ్ మెంబర్ మహేష్ మహిపాల్ రెడ్డి చక్రం తదితరులు పాల్గొన్నారు.
