పయనించు సూర్యుడు న్యూస్// నారాయణపేట జిల్లా ముక్తల్ నియోజకవర్గం ఇంచార్జ్ వడ్ల శ్రీనివాస్ 21 తేదీ మార్చ్
మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వాకిటి ఆంజనేయులు మక్తల్:21/03/2025: నేడు స్థానిక మక్తల్ పట్టణంలోని I B లో మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ సంఘం కార్యవర్గ సమావేశము మక్తల్ పట్టణ అధ్యక్షుడు గుంటి రఘు ఆధ్వర్యంలో నిర్వాహన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వాకిటి ఆంజనేయులు ఈసరి శ్రవణ్ కుమార్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు వాకిటి ఆంజనేయులు మాట్లాడుతూ *ఎన్నో సంవత్సరాలుగా బహుజనులు జనాభాలో సగమైనప్పటికీ ఐక్యత లోపం వల్ల రాజ్యాధికారాన్ని కోల్పోయాం, ఎందరో మహానుభావులు ఆ వైపు ప్రయాణం చేస్తూ వచ్చారు అందులో మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్, కాన్సిరాం, పి శివ శంకర్ మొదలైన వారి మార్గాన్ని అనుకరిస్తూ బహుజనుల అభ్యున్నతికి పాటుపడుదామని, రాజ్యాధికారం వైపు ప్రయాణం అవుదామని పిలుపునిచ్చారు. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈసరి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ బీసీ, ఎస్సీ,ఎస్టీలు ఐక్యమత్యంగా ఉండి పోరాడితే తప్ప హక్కులు ప్రాప్తించవు. అగ్రవర్ణాల మాయలో పడి తమ ఉనికిని పోగొట్టుకొని కాంతిని పోగొట్టుకొని నిర్వీర్యమైపోతున్న బహుజను లారా మేల్కోండి అని తెలిపారు. పార్టీలు ఏవైనా మన లక్ష్యమే మనకు ముఖ్యము అనే విధంగా ఉండాల్సిన అవసరం ఉంది అని తెలిపారు. BC, SC, ST మైనారిటీలందరూ కలిసి రావాలని కోరారు. మక్తల్ పట్టణ అధ్యక్షుడు గుంటి రఘు మాట్లాడుతూ బహుజనలందరూ ఎన్నో పార్టీల లో తిరుగుతూ ఎన్నో జెండాలు మోసి అలసిపోయాం అందులో నేను కూడా ఒక్కడినని మహాత్మ జ్యోతిరావు పూలే సంఘం ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందానని ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుంతలు ఆంజనేయులు నరసింహులు చంద్రశేఖర్ మంగలి రవి టింగిలి నరేష్ ప్రవీణ్ కుమార్ రామన్ గౌడ్ కురువ బాలు ఎల్లప్ప కురువ ఆంజనేయులు గుంతలి రమేష్ కుమ్మరి వెంకటేష్ సత్యారం ఆంజనేయులు ఆనంద్ గౌడ్ దండు అశోక్ భీమేష్ మంగలి వెంకటేష్ ఆనంద్ సాగర్ కృష్ణ హోటల్ వెంకటేష్ పాల్గొనడం జరిగింది.