(పయనించే సూర్యుడు అక్టోబర్ 11 రాజేష్)
ఈరోజు దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో నిన్నటి రోజున అనగా దౌల్తాబాద్ మండల తాజా మాజీ ఎంపీపీ గంగాధరి సంధ్య భర్త రవీందర్ గారి తల్లి పోచవ్వ అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. వారి అమ్మ మరణించినందున వారి కుటుంబానికి అండగా బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటదని వారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక బిఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్. దౌల్తాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు సయ్యద్ రహీముద్దీన్. తాజా మాజీ వైస్ ఎంపీపీ అల్లిశేఖర్ రెడ్డి. ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బండారు దేవేందర్. సర్పంచ్ అయ్యగారి నరసింహులు. సప్న జనార్దన్ రెడ్డి. ఎంపీటీసీ జోడు నవీన్ కుమార్. కో ఆప్షన్ హైమద్. బిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ నర్రారాజేందర్. మండల ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరాజు. మాజీ ఎంపీటీసీ సత్యం. స్వామి. అంజి చామంతి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు