
రుద్రూర్, జనవరి 5 ( పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ గ్రామానికి చెందిన జకరం లక్ష్మణ్ 4 వార్డ్ బీజేపీ అభ్యర్థి నాయణమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది. స్థానిక బిజెపి నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న బాన్సువాడ బిజెపి నాయకులు ఎన్నారై కోనేరు శశాంక్ తక్షణమే స్పందించి సోమవారం వారి కుటుంబీకులను పరామర్శించి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గం సీనియర్ నాయకులు మార్కెల్లి ప్రకాష్ పటేల్ , పార్వతి మురళి, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, కోశాధికారి కటిక రామరాజు, ఉపాధ్యక్షులు బోజిగొండ అనిల్, ప్రధాన కార్యదర్శులు వడ్లసాయినాథ్, బీజేవైఎం మండల అధ్యక్షులు కుమ్మరి గణేష్, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.