
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో
కలి వెలుగుల చక్రపాణి. భైంసా మండలం మాటేగాం గ్రామానికి చెందిన అగ్రే పోసాని గారి యొక్క ఇల్లు కరెంటు షాక్ వల్ల పూర్తిగా కాలిపోవడం జరిగింది. పోసాని కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో విషయం తెలుసుకున్న మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోంస్లే మోహన్ రావు పాటిల్ వెళ్లి వారికీ జరిగిన సంఘటన గురించి తెలుసుకొని వారు ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులకు చైర్మన్ భోస్లే మోహన్ రావు పాటిల్ ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు అదే విధంగా మోహనరావు పాటిల్ మాట్లాడుతూ అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఎల్లపుడు మా ట్రస్ట్ సహాయం చేయడం లో ముందు ఉంట్టది అని భరోసా కల్పిస్తూ,వీరితో పాటు మాజీ ఎంపీపీ సుభాష్ పాటిల్ మాజీ సర్పంచ్ శ్యామ్ రావు శ్రీకాంత్, దేవరావు, గ్రామస్థులు పాల్గొనడం జరిగింది.
