పయనించేసూర్యుడు అక్టోబర్ 18 రాజేష్)
ఈ రోజు తిర్మలాపూర్ గ్రామంలో పలువురిని పరామర్శించి తెలంగాణ రాష్ట్ర SC/ST కమిషన్ చైర్మన్ గౌ శ్రీ బక్కి వెంకటయ్య గారు మాట్లాడుతూ తిర్మలాపూర్ మాజీ సర్పంచ్ బండారు రాజయ్య గారు 1995 గ్రామ సర్పంచిగా ఎనలేన్ సేవలు చేసిన దళిత నేతగా ప్రజల మన్ననలు పొందారు.ఆయన అనారోగ్యముతో బాధపడుతూ రెండు వారాల క్రితం మృతి చెందటం బాధాకరం, జనగామ దయాకర్ పాము కాటుతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందటం బాధాకరం…… దౌల్తాబాద్ మండల బి ఆర్ ఎస్ టౌన్ అధ్యక్షుడు నర్సింహ రెడ్డి తల్లి మరణించిన విషయాన్ని తెలుసుకొని ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక బి ఆర్ స్ సమన్వయ కర్త రణం శ్రీనివాస్ గౌడ్, దౌల్తాబాద్ మండల బి ఆర్ స్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ రహీమొద్దీన్,తాజా మాజీ ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్ మండల కో–ఆప్షన్ హైమద్,మాజీ సర్పంచ్ సరుగారు యాదవ్ రెడ్డి, గ్రామ బి ఆర్ స్ పార్టీ అధ్యక్షుడు రమేష్ గౌడ్,బాల్ రెడ్డి,వెంకటయ్య,కృష్ణ స్వామి,సత్తయ్య,లక్ష్మీనారాయణ,రమేష్, మల్లేశం,శ్రీకాంత్,ప్రకాష్ తదితరులు ఉన్నారు.