పయనించే సూర్యుడు బాపట్ల ఏప్రిల్ 20:- రిపోర్టర్ (కే శివకృష్ణ )
ఈస్టర్ పండుగను పురస్కరించుకొని బాపట్ల లో ఉన్న అన్ని సంఘాల పాస్టర్లు, ఎఫ్.డబ్ల్యు కోల్ ఆధ్వర్యంలో ఆరాధన టీమ్ వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని శనివారం బాపట్ల లో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమన్ని ,ఎఫ్.డబ్ల్యు కోల్, మేజర్ వి యేసుపాదం,రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ . మానవాళి రక్షణ కోసం ఈలోకంలో జన్మించారని, అందరిని సమానంగా చూడాలని, ప్రేమ, కరుణ భావాలతో మెలగాలని, సేవతో ఉండాలని చెప్పిన కరుణమయుడన్నారు. రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన, పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలి పారు. కాగా సూర్యలంక ఇండెన్ గ్యాస్ గూడెం వద్ద నుండి ప్రారంభమై విజయలక్ష్మి పురం మీదుగా కొత్తపేట , దగ్గుమల్లి వారిపాలెం , విలియమ్ బూత్ , అంబేద్కర్ సర్కిల్ , గడియార స్తంభం సెంటర్ , పాత బస్టాండ్ , చీల్ రోడ్డు సెంటర్, టీచర్స్ కాలనీ వరకు చేరుకుని తిరిగి సి. బి. జడ్ . చర్చ్ వద్ద ముగిసింది. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం లో, కాగిత వరప్రసాద్,గేరా బెనర్జీ మినన్, గేరా మణి భూషణ్ జాన్,చెల్లి అశోక్, బాపట్ల జిల్లా క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు జంగం ప్రవీణ్, జోగి నోవహు, గుడపాటి జాన్ వెస్లీ, పవిత్ర కుమార్,గుమ్మడి ఆనంద్ బాబు, బెన్నీ టీమ్ షాలేం రాజు, చేతన్, మిల్కీ, దయాకర్ మరియు యూత్ పాల్గొన్నారు.