పయనించే సూర్యుడు బాపట్ల ఏప్రిల్ 8 :-రిపోర్టర్ (కే శివ కృష్ణ )
బాపట్ల జిల్లా పట్టణంలోని ప్రభుత్వం మున్సిపల్ హై స్కూల్ ఉన్నత పాఠశాల నుండి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ జె, వెంకట మురళి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా బాపట్ల: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో ర్యాలీ నిర్వహించిన, ఆరోగ్యశాఖ అధికారులు నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు, రెడ్ క్రాస్ సొసైటీ, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి
మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు స్వీయ నియంత్రణ ప్రతి ఒక్కరికి అవసరం ఆరోగ్యం సకల ఆనందాలకు సాధన వంటిది, అలాగే జన్మనిస్తూ ఏ తల్లి చనిపోకూడదు, జన్మిస్తూ ఏ శిశువు కూడా చనిపోకూడదు, పూర్వం జరిగిన విధంగా ఇంట్లో కాన్పులు చేయడం మంత్రసానుల మీద ఆధారపడటం మంచి పద్ధతి కాదు, అది తల్లి బిడ్డల ప్రాణానికి ప్రమాదం, రక్తహీనత ఉన్నప్పుడు ప్రభుత్వం అందిస్తున్న టాబ్లెట్స్ ప్రభుత్వం వారు ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క మందులను కూడా క్రమం తప్పకుండా వాడుకోవాలి, బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలి, ఆడబిడ్డ వయసు 21 సంవత్సరం అబ్బాయి వయసు అయితే 23 సంవత్సరాలు కచ్చితంగా ఉండాలి, అటువంటి అవగాహన తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తూ జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది అన్నారు, ఈ కార్యక్రమాన్ని ఇంతటి జయప్రదం చేసిన ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులకు నర్సింగ్ కాలేజీ విద్యార్థులకు రెడ్ క్రాస్ వారికి జిల్లా ప్రజలందరికీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో బాపట్ల డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ విజయమ్మ, బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ జి రఘునాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు