పయనించే సూర్యుడు గాంధారి 23/10/25
గ్రామీణ గిరిజన ప్రాంతాల్లోనీ క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికితీసి రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు రాణించేందుకు నిరంతర శిక్షణ శిబిరాని అందిస్తున్న బామన్ నాయక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ కి వాలీబాల్ క్రీడల్లో మెళుకువలు నేర్చుకోవడానికి అత్యంత ఉపయోగ పడే వాలీబాల్ అటాకింగ్ యంత్రం ను అమెరికాలో స్థిరపడిన బంజారా జాతి ఎన్నారై గోర్స్ ఫౌండేషన్ యూఎస్ఏ అందించినట్లు ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు, బామన్ నాయక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెట్ సంగం ను పైలట్ పాఠశాలగా గుర్తించి అక్కడే ప్రత్యేక క్రీడా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుంది, మారుమూల ప్రాంతాలలో క్రీడల అభివృద్ధికి ఫౌండేషన్ ఎంతో తోడ్పాటు అందిస్తుంది, క్రీడా సదుపాయాల గురించి ఎన్నారై గోర్స్ ఫౌండేషన్ యూఎస్ఏ లకు వివరించగా స్పందిన వారు వెంటనే 30,000 ఆర్థిక సహాయం అందించారు, రాజస్థాన్ రాష్ట్రం సజ్జన్ గడ్ లో ఈ యంత్రమును తయారు చేయించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులతో ఫోన్ లో మాట్లాడి ప్రత్యేకంగా అభినందించారు, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని. మారేమన్న అవసరాలు ఉంటే తప్పకుండా సహాయా సాకారాలు అందిస్తామన్నారు, పాఠశాల విదార్థులు, ఫౌండేషన్ ప్యాట్రన్ గుగ్లోత్ సురేందర్,అధ్యక్షురాలు సేవంత, బాలకృష్ణ. తదితరులు అభినందించారు, ఆధునిక క్రీడా పరికరంను అందించిన ఎన్ఆర్ఐ గోర్ ఫౌండేషన్ యూఎస్ఏ వారికి, మరియు ఎన్నారై రమావత్ కృష్ణ నాయక్ రమేష్ నాయక్ యుఎస్ఏ గారికిఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కుమార స్వామి గురువారం యంత్రాన్ని ప్రారంభించారు.ప్రారంభించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుమార స్వామి