
పయనించే సూర్యుడు మార్చి 29 ముమ్మిడివరం
) డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం .ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలిగా అమలాపురం నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకురాలు డాక్టర్ పి. నాగ మానస నియమితులయ్యారు. దీనికి సంబంధించిన ప్రభుత్వం నుంచి శనివారం ఆదేశాలు వెలువడ్డాయి. చైర్ పర్సన్ తో పాటు ఆరుగురు సభ్యులును నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు ఆమె నియామకం పట్ల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి మోకా వెంకట సుబ్బారావు మరియు పలువురు హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆమె సేవలు రాష్ట్రానికి మార్గదర్శకంగా నిలుస్తాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కమిషన్ సభ్యురాలిగా నియమితులైన డాక్టర్ నాగ మానసను బిజెపి మోకా వెంకట సుబ్బారావు అభినందించారు.