
విద్యార్థుల సంక్షేమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
పయ నించే సూర్యుడు జూలై 21 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ)రామచంద్రపురం, విద్యయే మహా ఆయుధమని, ఉన్నత లక్ష్యాలతో కష్టపడి చదివి శిఖరాలు అధిరోహించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రామచంద్రపురం స్టీల్ వెల్ పేట సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో విద్యార్థినులకు ప్రభుత్వం మంజూరు చేసిన ట్రంక్ బాక్సులు, ప్లేట్లు, గ్లాసులు, బ్లాంకెట్లు, స్వెటర్లు, టవల్స్ తో కూడిన కిట్లను పంపిణీ చేశారు.ముస్తాబు కార్యక్రమం ఏఎస్డబ్ల్యూఓ పద్మశ్రీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ విద్యతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కోసం ప్రభుత్వం ముస్తాబు కార్యక్రమం అమలు చేస్తోందన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ విద్య నాణ్యంగా మారుతోందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూరదృష్టితో ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు ప్రైవేటుకు దీటుగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. 22న తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామన్నారు.సమస్యలు విని హామీవసతి గృహంలో 112 మంది ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ విద్యార్థినులు ఉన్నారని అధికారులు తెలిపారు. విద్యార్థినుల సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి ప్రతి గది పరిశీలించి సూచనలు చేశారు. విద్యకు సంబంధించి ఏ అవసరం ఉన్నా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఫౌండేషన్ ద్వారా సదుపాయాలు
విద్యార్థినుల అవసరాల మేరకు సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ద్వారా 112 మందికి పరుపులు, పిల్లోలు, 2 ఇన్వర్టర్లు, కళాశాలకు వెళ్లిరావడానికి 2 ఎలక్ట్రిక్ ఆటోలు ఇస్తామని ప్రకటించారు.ఆర్థిక సహాయంబీఫార్మసీ చదువుతున్న పేద విద్యార్థిని మల్లే రత్నంకు మంత్రి తన సొంత నిధుల నుంచి రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ ఏవిఆర్ఆర్ రాజు, డిఈ శ్రీకాంత్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కె. లోవలక్ష్మి, జి. సీతాదేవి, ఎస్కేపీపీ ట్రస్ట్ చైర్మన్ సలాది నాయుడు, జాస్తి విజయలక్ష్మి, దొమ్మలపాటి విజయలక్ష్మి, కూటమి నాయకులు, అధికారులు, విద్యార్థినులు పాల్గొన్నారు.