పయనించే సూర్యుడు అక్టోబర్ 18 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలం ఆదురుపల్లి హైస్కూల్ నందు ఈ కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమమునందు కిశోరీ బాలికలు అందరిని హాజరుపరిచి బాల్యవివాహాల బాల్యవివాహాల వల్ల వచ్చే నష్టాల గురించి బాల్య వివాహం చేసుకుంటే వివాహం చేసుకుంటే చట్టపరంగా నేరమని తెలియజేయడమైనది అలాగే వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు హెల్ప్ లైన్ నంబర్లను ఉపయోగించుకొనవలనని చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్1098 సఖి వన్ స్టాప్ సెంటర్181 నంబర్లకు ఫోన్ చేసి వారి యొక్క సమస్యలను పరిష్కరించుకోవచ్చునని పిల్లలందరికీ తెలియజేస్తూ ప్రతి బాలిక కూడా రక్తహీనత లేకుండా మంచి పోషకాహారాన్ని చిరుధాన్యాలు ఆకుకూరలు పాలు గుడ్లు ఇలాంటి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకొని రక్తహీనత లేకుండా ఆరోగ్యంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకొన వలనని బాలికల అందరికీ తెలియజేయడమైనది ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అంగన్వాడీ కార్యకర్తలు స్కూల్ టీచర్స్ పాల్గొన్నారు