పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో
బాల్కొండ మండల కిసాన్ నగర్ గ్రామంలో 20 లక్షల తో నూతన గ్రామ పంచాయతీ భవనం ముప్కాల్ మండల కేంద్రంలో 20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖాన మెండోరా మండల సొన్ పెట్ గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖాన మేండోరా మండలం నెహ్రు నగర్ గ్రామంలో 20 లక్షల తో నూతన గ్రామ పంచాయతీ భవనం భీంగల్ మండలం పెద్దమ్మ కాడి తండా లో 20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనం మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖాన భవనం పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ …పై పనులన్నీ గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మంజూరై పనులు పూర్తి చేయబడ్డాయి అన్నారు.గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ముందుచూపుతో ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా ఎక్కడెక్కడ గ్రామ పంచాయతి భవనాలు లేవో అక్కడ మంజూరు చేయడం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వ 10 సంవత్సరాల కాలంలో బాల్కొండ నియోజకవర్గంలో సుమారు 65 కి పైగా నూతన గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించడం జరిగింది. అవన్నీ కూడా ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నాయి ఎమ్మెల్యే అన్నారు మండలానికి ఒక ప్రభుత్వ హాస్పిటల్ మాత్రమే ఉంటుంది.గ్రామాల్లో ఎవరికైనా ఆత్యవసర పరిస్థితుల్లో చికిత్స అవసరం అయితే మండల కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది కావున ఆనాడే కేసీఆర్ ముందు చూపుతో ఆలోచించి ప్రతి ఏఎన్ఎం సెంటర్ ఉన్న గ్రామంలో ఒక పల్లే దవాఖాన నిర్మించాలని అనుకున్నారు.దీనివల్ల ప్రజల ముంగిటి కె వైద్యం తీసుకొచ్చి గ్రామీణ ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో మరింత తొందరగా చికిత్స అందే పరిస్థితి ఎర్పడుతుంది అన్నారు.బాల్కొండ నియోజకవర్గంలో సుమారు 24 కు పైగా పల్లె దవాఖాన లు మంజూరు చేసి నిర్మించాము ఈ రోజు ప్రారంభించిన 3 పల్లె దవాఖాన లో ఫర్నిచర్,మేటీరియల్, వైద్య సిబ్బంది తొందరగా వచ్చేలా ఏర్పాటు చేసి త్వరగా ప్రజలకు పల్లె దవాఖాన లను అందుబాటులోకి తేవాలని వైద్య అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు ప్రజలకు అవసరమైన ఉపయోగపడే మంచి పనులు ప్రారంభానికి ఆహ్వానించి అపూర్వ స్వాగతం పలికిన గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు వనమహోత్సవం లో భాగంగా కిసాన్ నగర్,సొన్ పేట్ గ్రామంలో మొక్కలు నాటిన మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ఆర్ ఎస్ పార్టీలో చేరికలు మెండోరా మండలం సొన్ పెట్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నుండి తిరిగి టిఆర్ఎస్ పార్టీలో చేరినారు.వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పార్టీలో చేరిన వారిలో ఉప సర్పంచ్ చిన్నోళ్ల రమేష్,మాజీ ఎంపిటిసి మాడుగుల గలక్ష్మి,తోపారం హన్మాండ్లు,రాకేష్,ముత్యం,సాగర్,మల్లేష్ , ప్రశాంత్,పులి గంగాధర్, రాజన్న,శ్రావణ్,మదన్ తదితరులు చేరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు,మాజీ ఎంపిపి,జెడ్పిటిసి లు, మాజీ సర్పంచ్ లు ఎంపిటిసి పి ఎ సి ఎస్ చైర్మన్ లు ఎమ్మార్వో ఎంపీడీవో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ రమేష్,వ్యవసాయా అధికారులు తదితరులు పాల్గొన్నారు.