పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో
మంగళవారం నాడు భీంగల్ పట్టణంలో మండల అధ్యక్షులు ఆరే రవీందర్ అధ్యక్షతన పట్టణ మరియు మండల కార్యశాల నిర్వహించడం జరిగింది,ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి మరియు భీంగల్ పట్టణ మరియు మండల ఇన్చార్జ్ జ్ నోముల నర్సారెడ్డి హాజరై కార్యకర్తలకు మరియు నాయకులకు ఈనెల 28వ తేదీన మోర్తాడ్ లో జరిగే మన ప్రధాని నరేంద్ర మోడీ మన్ కి బాత్ కార్యక్రమం విజయవంతం చేయాలని అధిక సంఖ్యలో రైతులు తరలిరావాలని మార్గ నిర్దేశం చేయడం జరిగింది,,బాల్కొండ నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి ఆదేశానుసారం బడా భీంగల్ గ్రామానికి చెందిన కొట్టాల మోహన్ మరియు మెండోరా గ్రామానికి చెందిన తక్కురి అంజయ్య లను కిసాన్ మోర్చా మండల ఉపాధ్యక్షులుగా నియమించి ఈరోజు నియమాక పత్రాలను అందజేసిన జిల్లా కార్యదర్శి నోముల నర్సారెడ్డి మరియు భీంగల్ మండల అధ్యక్షులు ఆరే రవీందర్ మరియు కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు తోట గంగాధర్,ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఓరగంటి కిషన్, ప్రధాన కార్యదర్శి బిర్రు రామకృష్ణ, కార్యదర్శి రజినీకాంత్,జి లక్ష్మీనారాయణ యువ మోర్చా మండల అధ్యక్షులు శెట్టి ప్రేమ్చంద్, తోట రమేష్,పట్టణ ప్రధాన కార్యదర్శి దయ్య ప్రవీణ్, పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షులు నీలం గంగాధర్,ఈశ్వర సాయి, తోపారం సురేందర్,పుండరీకం, నరేందర్ గౌడ్ మరియు మండల పదాధికారులు పాల్గొన్నారు..