
పయనించే సూర్యుడుD.17.06.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ : యూరియా సరఫరా విషయంలో ఎటువంటి బంధు ప్రీతికి తావు ఇవ్వకుండా రైతులందరికీ యూరియా సక్రమంగా ఎటువంటి అక్రమాలకు లేకుండా మొబైల్ అప్లికేషన్ ద్వార యూరియాని అందించే ప్రయత్నం చేస్తుంది. అప్లికేషన్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి వాటిని ప్రభుత్వం పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది.ఏదైనా సంస్కరణ చేయాలనుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కానీ ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది అన్న విషయాన్ని రైతన్నలు గమనించాలి.యూరియా సరఫరా సొసైటీల పరిధిలో ఉండేది గత పది సంవత్సరాలుగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ప్రశాంత్ రెడ్డి ఒక గజదొంగ ముఠాల ఏర్పడి సొసైటీలను డిఫాల్ట్ గా మార్చి నిర్వీర్యం చేశారు.
దాదాపు నాలుగు కోట్ల రూపాయలకు పైగా మార్క్ పెడ్ కు బకాయిలు పడి డిపాజిట్లను గల్లంతు చేసి తినడానికి అలవాటు పడ్డ ఈ గజదొంగలు ఇప్పుడు ఈ ప్రజా ప్రభుత్వం చేస్తున్న సంస్కరణల విధానానికి అడ్డుపడుతున్నారు.ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ విధానం వల్లయూరియా బస్తా ధరలొ ఎటువంటి హెచ్చుతగ్గులు ఉండవు ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రైతులకు అందుబాటులో ఉంటుంది ఎటువంటి దళారీ వ్యవస్థకు అవకాశం లేదుఈ యాప్ విధానం వల్ల స్టాక్ ఎంత అందుబాటులో ఉంటుందో మనకు తెలుస్తుందిగతంలో మాదిరిగా స్టాక్ ఉంచుకొని కూడా సొంత మనుషులకు ఇచ్చుకునేందుకు లేదు అని చెప్పే ఆస్కారం లేదుసొసైటీలు స్టాక్ ఉంచుకొని లేదు అని చెప్పి పక్క జిల్లాలకు స్టాక్ ను అధిక ధరకు అమ్ముకునే అవకాశం కూడా లేదుగతంలో వ్యవసాయానికి కాకుండా వివిధ పరిశ్రమల మరియు ఇతర అవసరాలకు యూరియాను డైవర్ట్ చేసేవారు ఇప్పుడు ఆ అవకాశం లేదుసొసైటీలు డిఫాల్ట్ అయితే రైతులకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు సొసైటీలు డిఫాల్ట్ అయితే ప్రైవేట్ డీలర్ల నుండి కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే యూరియాను కొనుగోలు చేసే అవకాశం ఉందిడబ్బున్నవాళ్లు యూరియాను కొనుగోలు చేసుకుని స్టాక్ పెట్టుకునే అవకాశం లేదు అందరికీ సరి సమానంగా సరి పోయేంత యూరియాను తీసుకోవచ్చుచదువుకొని వారికి స్మార్ట్ ఫోన్ లేని వారికి కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. దానికి ప్రభుత్వం వ్యవసాయ విస్తరణ అధికారులు, మీసేవ, టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా బుక్ చేసుకునే అవకాశం ఇచ్చింది అనుకున్నంత స్టాక్ వచ్చిన తర్వాత ఈ సమస్యకు పూర్తిగా పరిష్కారం లభిస్తుందిఒక ఫోన్ నెంబర్ కు వివిధ రకాల పట్టా పాస్ బుక్ లను అటాచ్ చేసుకునే అవకాశం ప్రభుత్వం ఇచ్చింది. కావున స్మార్ట్ ఫోన్ వినియోగం లేని వారు కూడా యూరియాను బుక్ చేసుకోవచ్చుసాంకేతికతను జోడించేటప్పుడు ప్రాథమిక దశలో కొన్ని కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి, ప్రతిపక్షాల ఉచ్చులో పడకుండా సంయమనంతో ఉంటే సమస్యలను పరిష్కారం అవుతాయని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ విజ్ఞప్తి చేశారు