
రుద్రూర్, ఫిబ్రవరి 20 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధితుక్కి మహేందర్)
రుద్రూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బాలల పరిరక్షణ జిల్లా అధికారి నాగేల్లి బాబు మాట్లాడుతూ.. 18 ఏళ్ళ లోపు బాలికలకు బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని అన్నారు. బాల్య వివాహం జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే 1098 (చైల్డ్ లైన్) కి లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తారాబాయి, ఎంపిడిఓ బాల గంగాధర్, ఐసిడిఎస్ సూపర్ వైజర్ శ్రీలత, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ సెక్రటరీలు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.
