పయనించే సూర్యుడు నంద్యాల జిల్లా రిపోర్టరు జి.పెద్దన్న
స్థానిక నంద్యాల జిల్లాలోని పార్క్ రోడ్డు సమీపంలో గల బాల అకాడమీ పాఠశాలలో జనవరి 30వ తేదీన అనగా గురువారం గాంధీజీ వర్ధంతిని జరుపుకోవడం జరిగినది. ఈ కార్యక్రమానికి పాఠశాల కరస్పాండ్ ఎం.జి.వి. రవీంద్రనాథ్, ప్రిన్సిపల్ మాధవీలత మేడం, విచ్చేసి మాట్లాడుతూ జాతి పితగా పేరు పొందిన మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవను ఆయన జీవిత విశేషాలను గురించి చాలా చక్కగా వివరించారు గాంధీజీ 1948 జనవరి 30వ తేదీన న్యూఢిల్లీలోని బిర్లా హౌస్ లో 78 సంవత్సరాల వయసులో మరణించారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.