
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: వేగవంతమైన దర్యాప్తుతో 10 రోజుల్లోనే కేసు ఛేదించిన నిర్మల్ జిల్లా పోలీసులు బాసర ఆలయంలో జరిగిన దొంగతనం కేసును నిర్మల్ జిల్లా పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు.ఇద్దరు అంతర్జిల్లా దొంగలు, దొంగిలించిన సొత్తును స్వీకరించిన మరో వ్యక్తి అరెస్ట్ – సుమారు 1.48 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారునేరం జరిగిన వెంటనే ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నాందేడ్, ధర్మాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. బాసర పోలీస్ స్టేషన్, సీసీఎస్ సిబ్బంది సమన్వయంతో సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారం ఆధారంగా చాకచక్యంగా దర్యాప్తు నిర్వహించి, బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి వెండి కిరీటం, హుండీని దొంగిలించిన ఇద్దరు అంతర్జిల్లా దొంగలను, దొంగిలించిన సొత్తును స్వీకరించిన మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు.కేసు వివరాలుగత నెల జూన్ 22వ తేదీన గుంటూరు జిల్లాకు చెందిన పల్లపు ఏడుకొండలు, నిజామాబాద్ జిల్లాకు చెందిన గైని కిరణ్ అలియాస్ రామకృష్ణ గోడదూకి ఆలయంలోకి చొరబడి గేటు తాళాలు పగులగొట్టి అమ్మవారి వెండి కిరీటం, హుండీని దొంగలించరు.అనంతరం హుండీలోని సుమారు రూ.16,000 నగదును తీసుకొని, వెండి కిరీటాన్ని రెండు భాగాలుగా విడదీసి అమ్మవారి ఆలయo వెనకాల వ్యాస గుహ దగ్గర ఉన్న గుట్టల పైనుండి పరారయ్యారు.మామూలు భక్తుల లాగా రైల్వేస్టేషన్‌ను చేరుకుని అక్కడ నుండి వెళ్లిపోయారు.దొంగిలించిన వెండి కిరీటాన్ని విక్రయించేందుకు నిజామాబాద్‌కు చెందిన కోడామ ఆనంద్ సహకారంతో మహారాష్ట్రలోని నాందేడ్‌కు తీసుకెళ్తుండగా, విశ్వసనీయ సమాచారం మేరకు 02-07-2026న కాచిగూడ–నాగర్సోల్ రైలులో ప్రయాణిస్తున్న ముగ్గురిని బాసర రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వీరు ఎక్కువగా రైల్వే సౌకర్యంగల ప్రాంతాల్లోని ఆలయాలు గుర్తించి దొంగతనాలు చేస్తున్నారు.స్వాధీనం చేసుకున్న సొత్తు1 కిలో 220 గ్రాముల వెండి కిరీటం 260 గ్రాముల వెండి పట్టీ ఒక స్మార్ట్ మొబైల్ ఫోన్ నిందితులుపల్లపు ఏడుకొండలు – గుంటూరు జిల్లా (సుమారు 25 దొంగతనం కేసుల్లో నిందితుడు)గైని కిరణ్ అలియాస్ రామకృష్ణ – నిజామాబాద్ జిల్లా (సుమారు 20 దొంగతనం కేసుల్లో నిందితుడు)కోడామ ఆనంద్ – సోలాపూర్, మహారాష్ట్ర (దొంగిలించిన సొత్తును స్వీకరించి దాచిపెట్టినందుకు అరెస్ట్)పోలీస్ అధికారులకు అభినందనలుఈ కేసును అత్యంత వేగంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన ముధోల్ సీఐ రవీందర్ నాయక్, బాసర పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్. దీపక్, నిర్మల్ టౌన్ ఇన్స్పెక్టర్ సమ్మయ్య, హెడ్ కానిస్టేబుల్ ఖాలీద్, పోలీస్ కానిస్టేబుళ్లు భీమేష్, మోహన్, నరేందర్, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ జగన్ సింగ్, పోలీస్ కానిస్టేబుల్ తిరుపతి, హోంగార్డ్ సతీష్‌లను జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు