
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి.
అమ్మ వారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే రామరావ్ పటేల్
బాసర జ్ఞాన సరస్వతి అమ్మ వారి సన్నిధిలో వసంత పంచమి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి.. అమ్మ వారికి పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సమర్పించారు. బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ఆలయ చైర్మన్ శరత్ పాఠక్ లు ఆలయం లో ప్రత్యేక పూజలు చేశారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామరావ్ పటేల్ మాట్లాడుతూ అమ్మ వారి దయ తో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు..వసంత పంచమి వేడుకల సందర్భంగా దేశ నలుమూలల నుండి భక్తులు తరలి వచ్చారు. అమ్మ వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు..
