పయనించే సూర్యడు జనవరి 14 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు ఈ రోజు BRS పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుకి నిరసనగా కోదాడ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారి ఆదేశాల మేరకు కరీంనగర్ వెళ్తుంటే మార్గ మధ్యలో నడిగూడెం బి ఆర్ఎస్ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను 6 గ్యారంటీల ఆమలును ప్రశ్నిస్తున్నందుకు తట్టుకోలేక నిన్న హైదరాబాద్ 10టీవీ ఆఫీస్ వద్ద హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయటాన్నినడిగూడెం బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బోనగిరి ఉపేందర్ తీవ్రంగా ఖండించారు. పూటకో అక్రమ కేసు పెట్టడం.. రోజుకో బిఆర్ఎస్ నేతలను అన్యాయంగా అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారింది.ఈ కాంగ్రెస్ పార్టీ బి ఆర్ఎస్ నాయకులను ఎంతమందిని అరెస్టులు చేసిన మేము ప్రజల పక్షాన ఉండి పోరాడుతాం. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ కార్యదర్శి కాసాని సతీష్. మండల ఉపాధ్యక్షులు దున్న రవి. మాజీ ఉప సర్పంచ్ ఎస్.కె మౌలానా మండల మైనార్టీ నాయకులు sk జలీల్. మండల యూత్ నాయకులు మేకల వీరబాబు బడుగుల వెంకటేశం. పోలంపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు