బిఆర్ఎస్ కొత్తపల్లి మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు ఆకుల రవీందర్ పటేల్..
పయనించే సూర్యడు // ఏప్రిల్ // 24 // కుమార్ యాదవ్ // హుజురాబాద్ )..
బిఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు గ్రామ గ్రామాల నుంచి స్వచ్ఛందంగా లక్షలాదిగా తరలి రావాలనీ బిఆర్ఎస్ కొత్తపల్లి మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు ఆకుల రవీందర్ పటేల్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ రజతోత్సవ సభ కానీ విని ఎరుగని రీతిలో జరగనుందని రవీందర్ పటేల్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 27న జరగనున్న ఎల్కతుర్తి బిఆర్ఎస్ రజతోత్సవ సభలో కెసిఆర్ మాటల కోసం అన్ని వర్గాల ప్రజలంతా ఎదురు చూస్తున్నారని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని రైతుల పంటలకు నీళ్లు ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోయాయని పండిన కొద్ది పంటను కొనక రైతులు ధాన్యం తగలబెట్టి నిరసన వ్యక్తం చేస్తూ మళ్లీ కెసిఆర్ ను కోరుకుంటున్నారని అన్నారు. నాడు 14 ఏళ్లు ఉద్యమం చేసిన, పదేళ్లపాటు అభివృద్ధి చేసిన, నేడు 16 నెలలు ప్రతిపక్షంలో ఉన్న తెలంగాణ ప్రజల కోసమే బిఆర్ఎస్ పని చేస్తుందన్నారు. కెసిఆర్ ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాడని ఇప్పుడు సభలో ఏం చెబుతాడో మాకు ఏం భరోసా ఇస్తాడో అని ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నాయకత్వంలో గ్రామ గ్రామం నుంచి స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు అన్ని గ్రామాలు, వార్డుల్లో సమావేశాలు ఏర్పాటు చేసి సిద్ధమయ్యారన్నారు. ఈ సభలో పార్టీ అధినేత కేసీఆర్ బిఆర్ఎస్ పదేళ్ల అభివృద్ధిని, 16 నెలల ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడతాడన్నారు. సభకు ఇప్పటికే కొన్ని జిల్లాల నుండి బండెనుక బండి కట్టి 16 బండ్లుగా పయనమైన రైతుల ఎడ్ల పండ్లకు గ్రామ గ్రామాన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని దీంతో రేవంత్ పాలనపై దాడి చేసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని చెప్పారు. నేడు కరెంటు ఇవ్వడం లేదని, రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని, పండిన కొద్ది పంటను కొనడం లేదని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బిఆర్ఎస్ రజతోత్సవ సభకు కౌశిక్ రెడ్డి పిలుపునందుకొని ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని, ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాలు ఏర్పాటు చేసినప్పటికీ సరిపోవడం లేదన్నారు. ఈనెల 27న జరగనున్న బిఆర్ఎస్ రజతోత్సవ సభకు అన్ని వర్గాల ప్రజలు రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా రవీందర్ పటేల్ పిలుపునిచ్చారు.