▪️దర్గా కు 50 సిమెంట్ బస్తాలు అందజేత.. ▪️ బిజిగిరి షరీఫ్ దర్గాకు తన వంతు కృషి చేస్తానని హామీ..
పయనించే సూర్యడు // మార్చ్ // 18 // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ // కుమార్ యాదవ్..
హుజరాబాద్ నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ లోని హజ్రత్ సయ్యద్ ఇంకెషావలి అలీ దర్గా ను, సామాజికవేత్త, జన్పాక్ట్ కంపెనీ వైస్ చైర్మన్ సబ్బని వెంకట్ సందర్శించారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ వారు ఘన స్వాగతం పలికి మత గురువు మహమ్మద్ యాసిన్ తో ప్రత్యేకమైన ఫాతిహా ఖానీప్రత్యేక పూజజరిపించారు. అనంతరం దర్గా కమిటీ వారు అభివృద్ధి కొరకు పలు పనులను సబ్బని వెంకట్ దృష్టికి తీసుకురాగా తక్షణమే స్పందించి 50 బస్తాల సిమెంటును అందజేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో బిజిగిరి షరీఫ్ దర్గా అభివృద్ధి కొరకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అధ్యక్షులు మహ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో సబ్బని వెంకట్ ను శాలువాతో ఘనంగాసత్కరించారు. ఈ సందర్భంగా ఆయన వెంట బిజిగిరి షరీఫ్ గ్రామ ప్రజలు, ముస్లిం సోదరులు తదితరులు ఉన్నారు.