పయనించే సూర్యుడు సెప్టెంబర్ 16 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కె శ్రవణ్ కుమార్
బిజినపల్లి మండలం లో ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు. బిజినపల్లి మండలంలో మొత్తం 61 వేల 735 మంది ఓటర్లు ఉన్నారని ముసాయిదా ఓటర్లు తుది జాబితా వెల్లడించింది. ఇందులో 30,695 మంది పురుషులు ఓటర్లు గాక, 31,040 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. దీంతో బిజినపల్లి మండలంలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. వీరంతా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.