పయనించే సూర్యుడు ఏప్రిల్ 17 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ రాజకీయాల్లో రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. ఇటీవల రాష్ట్రంలో నడుస్తోన్న రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జోరుగా నడుస్తుండగా.కులగణన చేసి బీసీలకు న్యాయం చేస్తున్నామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే, తప్పుల తడకతో జనాలను మోసం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తూ. ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే.. బీజేపీ పార్టీ కూడా తమ గళాన్ని గట్టిగా వినిపిస్తూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇటీవల.. ప్రధాని మోదీ కులానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తమదైన శైలిలో ఖండిస్తూ.. కమల దళం అందరి దృష్టిని తమవైపు తిప్పుకుంటోంది. ఈ క్రమంలోనే.. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడి నియమానికి ముహూర్తం ఖరారు అయింది, ఈనెల ఇరవై తారీకు తర్వాత బిజెపి జాతీయ అధ్యక్షుడుని ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజుల్లో ఆరు రాష్ట్రాల అద్యక్షుల ను ప్రకటించే ఛాన్స్ ఉంది.. దీనికోసం బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అమిత్ షా, రాజ్ నాథ్, నడ్డా, పాల్గొన్నారు. తెలంగాణ ఏపీ, తో సహా యూపీ,మధ్యప్రదేశ్ ఉత్తరఖండ్, కర్ణాటక, పుదుచ్చేరి, అధ్యక్షులను త్వరలోనే ప్రకటించను న్నారు.