
పయ నించే సూర్యుడు ఆగస్టు 18 ముమ్మిడివరం ప్రతినిధి బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు, నందమూరి తారక రామారావు కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరికి రాజనగరం భారతీయ జనతా పార్టీ మాజీ అసెంబ్లీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి శుభాకాంక్షలు తెలియజేశారు. జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులైన సందర్భంగా ఆయన పురందేశ్వరికి అభినందనలు తెలిపారు.నందమూరి కుటుంబంలో నుంచి వచ్చిన రాజకీయ ఆడపడుచుగా పురందేశ్వరి ప్రజాసేవలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. ఇంతకుముందు కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం పురందేశ్వరికి ఉందని తెలిపారు. పార్టీని బలోపేతం చేయడంలో పురందేశ్వరి పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. రాష్ట్రంలో బిజెపికి మంచి భవిష్యత్ ఉందని, పురందేశ్వరి నాయకత్వంలో పార్టీ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో పురందేశ్వరి కృషి అభినందనీయ మని తెలిపారు. రాజనగరం నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలందరూ పురందేశ్వరికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని వీరన్న చౌదరి చెప్పారు.పురందేశ్వరి అనుభవం, సేవా దృక్పథం పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడానికి ఆమె నాయకత్వం కీలకంగా ఉంటుందని ఆకాంక్షించారు.