

పయ నుంచే సూర్యుడు ఆగస్టు 27 ముమ్మిడివరం( ప్రతినిధి గ్రంధి నానాజీ)బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలిగా రాజమహేంద్ర వరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నియమితులైన సందర్భంగా రాజమహేంద్రవరంలో తూర్పుగోదావరి జిల్లా బిజెపి కార్యాలయంలో దగ్గుబాటి పురందేశ్వరిని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎంఎల్సీ సోము వీర్రాజు, తూర్పుగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నీరు కొండ వీరన్న చౌదరి ఏపీ ఆర్ చౌదరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సభ్యులు, బిజెపి నాయకులు, అనపర్తి నియోజకవర్గం బిజెపి నాయకులు, కార్యకర్తలు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అదే కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పిల్లమార్రి మురళికృష్ణ, కురగంటి సతీష్ నియమితులైన వారిని దగ్గుబాటి పురందేశ్వరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, సోము వీర్రాజు, పిక్కి నాగేంద్ర, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.