పయనించే సూర్యుడు జనవరి 12 డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ
ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 162 వ జయంతి సందర్భంగా స్వా rcమి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి సురేష్ మాట్లాడుతూ అందరికీ స్వామి వివేకానంద 162వ జన్మదిన మరియు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ
1000 సంవత్సరాల బానిస పాలనలో భారతీయులకు ఏమీ రాదు, ఏమీ తెలియదు అనుకునే ప్రపంచానికి భారతదేశ సంస్కృతి, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన భరతమాత ముద్దుబిడ్డ…యువత లక్ష్యాలు ఎలా ఉండాలి అని తెలియజేసిన ధీరుడు…"మానవసేవే మాధవసేవ" అని ఆచరించి, ఈ దేశంలో ఒక ప్రాణి కూడా పస్తుతో ఉన్నంతవరకు మరలా,మరలా జన్మిస్తూనే ఉంటానని తెలిపిన త్యాగి స్వామి వివేకానంద అని అన్నారు కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గుండాల అంజయ్య, సీనియర్ నాయకులు నక్క వెంకటేష్ యాదవ్, నేతల వెంకటేష్, ఉప్పల వెంకటేష్, సోనగంటిరవి ప్రసాద్, జల్దా భాస్కర్, సముద్రాల సహదేవ్, అప్పం అజయ్, ఈడం రవికుమార్, గంజి హరి, పబ్బు సైదులు, చండీశ్వర్,రెడ్డి శంకర్ చిత్రియాల నాగేంద్ర, ,అర్థం రమేష్ , బెలిదేమాధవి, కాసుల శంకరయ్య, కాసుల శారద,ఎర్ర బిక్షపతి, అవ్వారి శేఖర్, ఇరుగదిండ్ల శ్రీను, ముసిని వెంకటేశ్వర్లు,గుర్రం మహేష్, బిక్షపతి జాదవ్, పోలగొని హరి, ఆంజనేయులు, సంపంగి సైదులు తదితరులు పాల్గొన్నారు