పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 8
అల్లూరి సీతరామరాజు జిల్లా వి.ఆర్ పురం మండలలో నిన్న వి ఆర్ పురం మండలం బిజెపి అధ్యక్షులు శ్రీ ముత్యాల రాంబాబు మరియు వారి కుటుంబం స్థానిక మండల నాయకులు ఉయిక రత్తయ్యలపై సిపిఎం చెందిన సుమారు 30 మంది దౌర్జన్యంగా ఇంటిలోకి ప్రవేశించి తీవ్ర పదజాలంతో దూషించి మిమ్మల్ని కొట్టి చంపి బండ్లకు కట్టి లాఖేల్తం అంటూ తీవ్రమైనటువంటి వేధింపులకు గురిచేసిన పులి సంతోష్, కారం సుందరయ్య, పంకు సత్తిబాబు, కమ్మచిచ్చు సత్తిబాబు,వడ్లాది రమేష్, గుండెపుడి లక్ష్మణరావు, హజరత్ హాస్ లక్ష్మయ్య, పులి బుజ్జి ఆత్మకూలి కాంతారావు, సోడి మల్లయ్య లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు విఆర్ పురంలో జరిగిన అఖిలపక్ష నాయకులు సమావేశం ఖండించింది. ఈ సందర్భంగా తెలుగుదేశం సీనియర్ నాయకులు( మాజీ జెడ్పిటిసి ) ముత్యాల రామారావు, బుర్ర నరసింహారావు, బుర్ర నరేష్, ఆసంటి శ్రీను, శేఖర్, ఆది మరియు వైసిపి నాయకులు పెట్ట రాజు,, మేడం నరేష్, మెంతుల నాగరాజు, మెంతుల వెంకటనారాయణ, , మరియు జనసేన నాయకులు ముల్కల సాయి కృష్ణ, బాగుల ప్రమీల, బాగుల అంజన్ రావు, బిజెపి నాయకులు డివిఎస్ రమణారెడ్డి( డివిజన్ మాజీ అధ్యక్షులు/ కో కన్వీనర్ ) కారం ధరయ్య, సీనియర్ నాయకులు కడుపు వెంకటరమణ, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఉయిక రత్తయ్య, గిరిజన మోర్చా డివిజన్ నాయకులు సొంది నాగేశ్వరావు, జిల్లా కార్యదర్శి బుర్ర కామేశ్వరి పాల్గొని ఈ సమావేశానికి జిల్లా మాజీ కార్యదర్శి పాయం వెంకయ్య అధ్యక్షతన వాయించరు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ భూ ఉద్యమాలు ద్వారా ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని సిపిఎం చేసిన ప్రయత్నం బెరిసి కొట్టిందని తమ పార్టీ నాయకులు అనుసరిస్తున్న విధానల వలన ప్రజల్లో సిపిఎం పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తుందని ఆ వ్యతిరేకం తట్టుకోలేక ప్రజల తరఫున సిపిఎం యొక్క క్యర్తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ముత్యాల రాంబాబు కుటుంబం పైన దాడి చేయడం వారి యొక్క దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. రాజకీయాలలో నిత్యం ఇతరులపై అవినీతి ఆరోపణలు విమర్శలు చేస్తూ ప్రజల్ని రెచ్చగొట్టే సిపిఎం తన తప్పుల్ని ఎత్తిచూపితే సహించ అటువంటిది ఓపిక లేకపోవడం వారి యొక్క పతనానికి చివర రోజులని అఖిలపక్ష నాయకులు తెలిపారు. పోలీసులు అధికారులు దానికి పాల్పడ్డ వారిలో కొంతమంది హత్య నేర ఆరోపణలు హత్య నేర శిక్ష అనుభవించిన వారు ఉన్నారని వారి నేర ప్రవృత్తిని మండల ప్రజలపై బ్రాంతులను కలుపుతున్నారని వారిని కఠినంగా శిక్షించాలని అఖిలపక్ష కమిటీ నాయకులు చేశారు. పోలవరం నిరసితుల భూములపై జండాలు గుచ్చినవారు వారిని ప్రోత్సహిస్తున్న వారు అందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలని సబ్ కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను అమలు జరిపి రైతులకు న్యాయం చేయాలని అఖిలపక్ష నాయకులు పోలీస్ మరియు రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేశారు.