పయనించే సూర్యుడు న్యూస్// 7 తేదీ ఏప్రిల్ నారాయణపేట జిల్లా ఉట్కూర్ నియోజకవర్గ వడ్ల శ్రీను
బిజ్వార్ రామాలయంలో శ్రీరామ నవమి సందర్భంగా పూజారులు నర్సింహా చారి,రవి చారి గారు ఐదు మంది దంపతులచే గణపతి పూజ ,నవగ్రహ పూజ,హోమం మొదలగు పూజలు చేయించి గ్రామ పూజారులు నాగరాజు చారి,వేణుగోపాల చారి చే శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా చేయించారు..చిన్నారుల భక్తి నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి.తదుపరి అన్నదాన కార్యక్రమం చేశారు.సాయత్రం శ్రీ ఆంజనేయ సమేత శ్రీ సీతారామలక్ష్మణుల రథోత్సవం అంగరంగ వైభవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త సుధాకర్ రెడ్డి,భక్తులు దత్తప్ప, దొరోళ్ళ కృష్ణయ్య,హెచ్.నర్సింహా,కొండారెడ్డి నర్సింహా రెడ్డి,శేఖర్,భూపాల్ రెడ్డి,నాగిరెడ్డి, వెంకప్ప గౌడ్,మహేష్ గౌడ్,ఆంజనేయులు గౌడ్,అశోక్, పొర్ల వెంకటేష్,రమేష్, గోవింద్ జ్,రాఘవేంద్ర,శివారెడ్డి,రమేష్,సంజీవ,తిరుమలేశ్,శ్రీశైలం ,శివ,నర్సింహా రెడ్డి,రవి, కుర్మప్ప , లొట్టి నర్సింహా, వడప్పతదితరులు పాల్గొన్నారు.