పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు
మానాల మోహన్ రెడ్డి వాక్య
ఈరోజు గురువారం రోజున కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన మాట ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చినా తర్వాతనే సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోవడం ద్వారా కేంద్రం నుంచి వచ్చే నిధులు రాక ఇబ్బంది పడుతున్నప్పటికీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అని, అసెంబ్లీ లోపల బిజెపి ఎమ్మెల్యేలు బీసీ బిల్లుకు ఆమోదిస్తున్నామని చెప్తూనే అసెంబ్లీ బయట బిజెపి ఎంపీలు బీసీ బిల్లు నుండి మైనారిటీలను తీసేస్తేనే బిల్లుకు ఆమోదం తెలుపుతామని చెప్పడం అనేది బిజెపి యొక్క ద్వంద నీతికి నిదర్శనం అని ఆయన అన్నారు. బీసీ బిల్లులో ఎక్కడ కూడా మైనారిటీలకు రిజర్వేషన్ ఇస్తామని తెలుపలేదని బీసీ లోకి వచ్చే అన్ని వర్గాలకు బిల్లు అమలవుతుంది అని మాత్రమే తెలపడం జరిగిందని, కానీ ఆ మాత్రం కూడా తెలవకుండా మైనారిటీలకు బీసీ బిల్లు నుండి తొలగిస్తే బీసీ బిల్లుకు ఆమోదం తెలుపుతామని బండి సంజయ్, కిషన్ రెడ్డి చెప్పడం చూస్తుంటే వారి అవివేకం బయటపడుతుందని, కేవలం మోడీ మెప్పు కొరకు మాత్రమే రాష్ట్రంలో బీసీ బిడ్డలకు బండి సంజయ్, కిషన్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని, కిషన్ రెడ్డి అగ్రకులానికి చెందిన వాడు కాబట్టి బీసీలకు రిజర్వేషన్ రావద్దు అని చెప్తున్నాడు అని , కానీ బీసీ బిడ్డ అయిన బండి సంజయ్ బీసీలకు రిజర్వేషన్ కల్పించడానికి ఎందుకు అడ్డుపడుతున్నాడో చెప్పాలని, అడ్డుపడటమే కాకుండా ఒక పిచ్చోడి మాదిరిగా మైనారిటీలను బీసీ బిల్లు నుండి తొలగిస్తేనే ఆమోదం తెలుపవుతామని చెప్పడం విడ్డూరంగా ఉంది అని ,బిసి బిల్లులు ఎక్కడ కూడా మైనారిటీలకు రిజర్వేషన్ ఇస్తామని ప్రత్యేకంగా తెలుపలేదు అని మానాల మోహన్ రెడ్డి వివరించారు.దేశంలో అందరికీ సామాన న్యాయం జరగాలని ఆలోచించే రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన కులగనన జరిపి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అని, నిజంగా బిజెపి నాయకులు బీసీ బిల్లును మద్దతు తెలుపుతూ ఎక్కడికక్కడ బిజెపి ఎంపీలు విలేకరుల సమావేశాలు నిర్వహించి బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని మానాల మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈనెల 15వ తేదీన కామారెడ్డిలో చరిత్రలో నిలిచిపోయే విధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పైన బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని, అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారని, జిల్లాలో ఉన్న బీసీ సోదరులందరూ ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహించుకుని బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించుకునే విధంగా ఈ నెల 15వ తేదీన నిర్వహించే సభను విజయవంతం చేయాలని, కచ్చితంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించి తీరుతామని మానాల మోహన్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి,రాష్ట్ర ఎన్ ఎస్ యు ఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్,జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్,జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్,జిల్లా sc సెల్ అధ్యక్షులు యాదగిరి, భీమ్గల్ మండల అధ్యక్షులు బోదిరే స్వామి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కేశ మహేష్,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తిప్పిరెడ్డి శ్రీనివాస్,లవంగ ప్రమోద్,ఈసా, అబ్దుల్ ఎజాజ్, సుభాష్ జాదవ్, సంగెం సాయిలు,నరేందర్ గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు