
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్
నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ మండల కేంద్రంలోని నందిగల్లికి చెందిన యువకులు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలొ ఈరోజు శుక్రవారం రోజున బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. ప్రజా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి మున్సిపల్ ఎన్నికలలొ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పార్టీలో చేరిన వారందరికీ ముత్యాల సునీల్ కుమార్ కండువాలు కప్పి హృదయపూర్వకంగా ఆహ్వానించడం జరిగింది. చేరిన వారిలో హరీష్, రాజు, వినీత్, గణేష్, సాయి, వినయ్, అజయ్ మరియు ఇతరులు ఉన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
